మల్లారెడ్డా.. మజాకా..
ABN, Publish Date - Dec 27 , 2024 | 02:04 PM
చామకూర మల్లారెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూలు అమ్మిన, పాలు అమ్మిన, కష్టపడ్డ, సక్సెస్ అయ్యా అంటూ ఆయన చెప్పే మాటలు తెగ వైరల్ అయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt)లో మంత్రిగా చేసిన మల్లారెడ్డి(Chamakura Mallareddy) ఏది చేసిన సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అయ్యేది.
హైదరాబాద్: చామకూర మల్లారెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూలు అమ్మిన, పాలు అమ్మిన, కష్టపడ్డ, సక్సెస్ అయ్యా అంటూ ఆయన చెప్పే మాటలు తెగ వైరల్ అయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt)లో మంత్రిగా చేసిన మల్లారెడ్డి (Chamakura Mallareddy) ఏది చేసిన సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అయ్యేది. మల్లారెడ్డి తన పంచ్ డైలాగులతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మల్లారెడ్డి, ఆయన కుమారుడుపై జరిగిన ఏసీబీ దాడులు సైతం ఎంతో ఉత్కంఠ రేపాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో ఈ మధ్య ఆయన కాస్త సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అయితే తాజాగా ఆయన జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఏడు పదుల వయసులోనూ యువకులకు ఏమాత్రం తీసిపోకుండా మల్లారెడ్డి ఉత్సాహంగా కసరత్తులు చేస్తూ కనిపించారు.
Updated Date - Dec 27 , 2024 | 02:04 PM