ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Wedding Season: 3 నుంచి శుభ ముహూర్తాలు

ABN, Publish Date - Nov 02 , 2024 | 03:54 AM

శుభ మూహూర్తాలు వచ్చేశాయి. 3వ తేదీ నుంచి డిసెంబరు చివరి వరకూ అంటే రెండు నెలల పాటు ముహూర్తాలున్నాయి. ఆ తర్వాత ధనుర్మాసం రాకతో ముహూర్తాలకు బ్రేక్‌ పడనుంది.

  • డిసెంబరు చివరి దాకా పెళ్లి సందళ్లే

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): శుభ మూహూర్తాలు వచ్చేశాయి. 3వ తేదీ నుంచి డిసెంబరు చివరి వరకూ అంటే రెండు నెలల పాటు ముహూర్తాలున్నాయి. ఆ తర్వాత ధనుర్మాసం రాకతో ముహూర్తాలకు బ్రేక్‌ పడనుంది. అయితే వివాహ వేడుకల సీజన్‌ ఆరంభంతో నగరంలో ఒక్కసారిగా సందడి మొదలైంది. ఈ సీజన్‌లో నగరంలో దాదాపు 60-70 వేల వివాహాలు జరిగే అవకాశాలున్నాయని, నవంబరు 3, 14 తేదీల్లో ఎక్కువ పెళ్లిళ్లు ఉన్నాయని పంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. గృహప్రవేశాలు, వివాహ ముహుర్తాలను చూసుకుంటే 3, 7, 14, 20, 22, 24 తేదీల్లో అధికంగా ఉన్నాయని చెబుతున్నారు పండితులు.


మరికొన్ని ముహూర్తాలు కూడా ఉన్నాయి కానీ, వాటిని ద్వితీయ ప్రాధాన్యంగానే చూస్తామని చెప్పారు. డిసెంబరులో 4, 5, 7, 14, 19, 20, 22, 25 తేదీలను మంచి ముహూర్తాలుగా చెప్పవచ్చునన్నారు. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు అనువైన కాలంగా వీటిని చెప్పవచ్చన్నారు. ఫంక్షన్‌ హాళ్ల యజమానులు కూడా ఈ రెండు నెలలూ తమ వేదికలకు బుకింగ్స్‌ ఇప్పటికే పూర్తయ్యాయని చెబుతున్నారు.

Updated Date - Nov 02 , 2024 | 03:54 AM