ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Group 1: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు.. ఎప్పుడంటే

ABN, Publish Date - Feb 26 , 2024 | 08:47 PM

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. రేవంత్ సర్కార్ గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ టీఎస్పీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది.

హైదరాబాద్: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. రేవంత్ సర్కార్ గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ టీఎస్పీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను(Group 1 Prelims) జూన్ 9న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. 563 ఉద్యోగాలకు మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచారు. దరఖాస్తుల సవరణకు మార్చి 23 నుంచి మార్చి 27 వరకు అవకాశం కల్పించారు. అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ.200గా,పరీక్ష ఫీజు రూ.120గా నిర్ణయించారు.

పాత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వాళ్లు మళ్లీ అప్లై చేసుకోవాల్సిందేనని.. అయితే.. గతంలో ఫీజు చెల్లించిన వాళ్లు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ జరగనుంది. మెయిన్ పరీక్షను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకుల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటోంది.

Updated Date - Feb 26 , 2024 | 08:50 PM

Advertising
Advertising