ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తల్లీకూతుళ్లు అదృశ్యం

ABN, Publish Date - Dec 31 , 2024 | 12:11 AM

కూతురితో కలిసి ఆస్పత్రికి వెళ్లిన తన భార్య తిరిగి ఇంటికి రాలేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పెద్దేముల్‌, డిసెంబర్‌ 30(ఆంధ్రజ్యోతి): కూతురితో కలిసి ఆస్పత్రికి వెళ్లిన తన భార్య తిరిగి ఇంటికి రాలేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆత్కూర్‌ తాండకు చెందిన కేతావత్‌ రేణుక(24) అనారోగ్యంతో ఉండగా ఈనెల 29న ఉదయం ఆస్పత్రికి వెళ్లివస్తానని ఇంట్లోచెప్పి వెల్లింది. తనతో పాటు ఆరు సంవత్సరాల తన కూతురు శ్రీలతను కూడా వెంటపెట్టుకుని వెళ్లింది. ఆమె భర్తకు పొలం పనులు ఉన్నందున వెంటవెల్లలేదు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూస్తే తన భార్య ఆస్పత్రి నుంచి రాలేదు. మరుసటిరోజు కూడా రాకపోవడంతో బంధువులు, తెలిసినవారందరి వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త కేతావత్‌ నరేష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

జగ్గంగూడలో వ్యక్తి..

మూడుచింతలపల్లి: వ్యక్తి అదృశ్యమైన సంఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కమాలాబాద్‌కు చెందిన బోయిని వెంకటేశ్‌ (45) నవంబరు 27వ తేదీన మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడలోని తన కూతురు ఇంటికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని వస్తానని ఇంటి నుంచి వెళ్లిన ఆయన సాయంత్రమైనా ఇంటికి రాలేదు. దీంతో పరిసరాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభ్యంకాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Updated Date - Dec 31 , 2024 | 12:11 AM