గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ABN, Publish Date - Dec 30 , 2024 | 12:14 AM
గండిపేట చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హిమాయత్‌నగర్ గ్రామ పరిధిలోని గండిపేట చెరువులో గుర్తుతెలియని మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మొయినాబాద్ రూరల్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గండిపేట చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హిమాయత్‌నగర్ గ్రామ పరిధిలోని గండిపేట చెరువులో గుర్తుతెలియని మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాల లోపు ఉంటుందని, మృతదేహంపై చెక్స్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంట్ ఉన్నాయి. అతడు మృతి చెంది దాదాపు 3 రోజులవుతున్నట్లు తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.
Updated Date - Dec 30 , 2024 | 12:14 AM