ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:35 PM

ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పేదల నుంచి డబ్బు డిమాండ్‌ చేస్తున్న జిల్లేడు పంచాయతీ కార్యదర్శి సమతపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గురువారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.

ఎంపీడీవోకు ఫిర్యాదు చేస్తున్న గ్రామస్థులు

చౌదరిగూడ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పేదల నుంచి డబ్బు డిమాండ్‌ చేస్తున్న జిల్లేడు పంచాయతీ కార్యదర్శి సమతపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గురువారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ప్రభాకర్‌, మహేష్‌, వెంకటేష్‌, బాలమణి, సునీత మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో సభ్యుల ప్రమేయం లేకుండా.. అర్హులైన పేదల నుంచి ఇళ్ల సర్వే చేయడానికి డబ్బులు డిమాండ్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాగే ఇంటి పర్మిషన్లు మంజూరు చేయడానికి కూడా డబ్బులు డిమాండ్‌ చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీకి చెందిన బోరు మోటర్‌ను విక్రయించడంతో పాటు పంచాయతీ నిధుల్లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తుందని వారు తెలిపారు. పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు విన్నవించారు.

Updated Date - Dec 19 , 2024 | 11:35 PM