మనస్తాపానికి గురై యువకుడి ఆత్మహత్య
ABN, Publish Date - Dec 28 , 2024 | 11:49 PM
మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన దోమ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దోమ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన దోమ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గోడుగోనిపల్లికి చెందిన చెక్కలి మల్లేశ్(28) ఇంట్లో కుటుంబ తగాదాల నేపథ్యంలో మానసిక వేదనతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈవిషయాన్ని స్నేహితులు, బంధువులతో చెప్పుకోకుండా లోలోపల మనోవేదన చెందాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న రేకులరాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు చూసేసరికి అప్పటికే మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ ఆనంద్ వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాధానం ఇచ్చారు.
Updated Date - Dec 28 , 2024 | 11:49 PM