కష్టజీవులకు అండగా ఎర్రజెండా
ABN, Publish Date - Dec 30 , 2024 | 12:11 AM
దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక న్యాయం, సమాన హక్కులు, కార్మిక కర్షకుల హక్కుల కోసం సీపీఐ ఎనలేని పోరాటాలు చేసిందని, కష్టజీవులకు అండగా ఎర్రజెండా ఉంటుందని రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంపై పోరాటం చేసి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతోత్సవాల సందర్భంగా మండలంలోని సజ్జన్‌పల్లి, తోలుకట్ట, పెద్దమంగళారం గ్రామాల్లో జెండాలు ఆవిష్కరించారు.
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి
మొయినాబాద్ రూరల్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక న్యాయం, సమాన హక్కులు, కార్మిక కర్షకుల హక్కుల కోసం సీపీఐ ఎనలేని పోరాటాలు చేసిందని, కష్టజీవులకు అండగా ఎర్రజెండా ఉంటుందని రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంపై పోరాటం చేసి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతోత్సవాల సందర్భంగా మండలంలోని సజ్జన్‌పల్లి, తోలుకట్ట, పెద్దమంగళారం గ్రామాల్లో జెండాలు ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో రామస్వామి పాల్గొని జెండాలను అవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం, సామాజిక న్యాయం, సమాన హక్కులు, కార్మిక కర్షకుల హక్కుల కోసం సీపీఐ ఎనలేని పోరాటాలు చేసిందని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావొస్తున్నా నేటికీ దేశంలో బడుగు, బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్నారని పాలకులపై మండిపడ్డారు. దేశంలో కార్మికుల చట్టాలు, రైతుల చట్టాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. కార్మిక కర్షకులకు వ్యతిరేరంగా చట్టాలు తీసుకువచ్చి వారిని నష్టదాయకం చేస్తున్నారని ఆరోపించారు. కష్టజీవులకు అండగా ఉన్న పార్టీ సీపీఐ అని తెలిపారు. గతంలో తోలుకట్ట గ్రామంలో నిరుపేదలకు ఇళ్లు ఇప్పించిన ఘనత సీపీఐకే దక్కుతుందని అన్నారు. పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నల్లగొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు పెద్దఎత్తున నాయకులు, కార్మికులు, అభిమానులు తరలిరావాలని పిలునిచ్చారు. సీనియర్ నాయకులు ప్రభులింగం, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, బీకేఎం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, సుధాకర్ గౌడ్, మొయినాబాద్ మండల కార్యదర్శి శ్రీను, యాదగిరి, యశోద, లక్ష్మణ్, బాల్‌రాజ్, వెంకటేష్, తూర్పు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 12:11 AM