PM Modi: నేడు, రేపు ప్రధాని పర్యటన.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ABN, Publish Date - Mar 04 , 2024 | 11:24 AM
నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) పర్యటన సందర్భంగా 4, 5 తేదీల్లో పలుప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ తెలిపారు.
హైదరాబాద్ సిటీ: నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) పర్యటన సందర్భంగా 4, 5 తేదీల్లో పలుప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ తెలిపారు. నాలుగోతేదీన రాత్రి 7:40 నుంచి 8:10 మధ్య బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రాజ్‌భవన్ మార్గంలో, ఐదోతేదీన ఉదయం 9:50 నుంచి 10:15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు మార్గంలో ఆంక్షలు ఉంటాయన్నారు.
Updated Date - Mar 04 , 2024 | 11:28 AM