ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MP Arvind: మూడో సారి కూడా బీజేపీదే విజయం

ABN, Publish Date - Feb 13 , 2024 | 03:57 PM

Telangana: బీజేపీలో ఘర్ వాపసి నడుస్తోందని.. బీజేపీలో పోటీ ఎక్కువగా ఉంటుందని ఎంపీ అర్వింద్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు.

నిజామాబాద్, ఫిబ్రవరి 13: బీజేపీలో ఘర్ వాపసి నడుస్తోందని.. బీజేపీలో పోటీ ఎక్కువగా ఉంటుందని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. మూడో సారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ మూడోసారి ప్రధాని కానున్నారు.. నిజమాబాద్ పార్లమెంటులో 5 లక్షల స్వయం సహాయక సంఘాలకు కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చామన్నారు. 7 లక్షల పైన ఆయుష్మాన్ భారత్ కార్డులిచ్చామన్నారు. మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 68 శాతం ఓట్లున్నాయన్నారు. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్‌కు ఒక్క పార్లమెంటు సీటు కూడా రాదన్నారు. తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ (BJP) గెలుస్తుందని అన్నారు.

నిజామాబాద్ మార్కెట్లో పసుపు రేటు రూ.13999 గా ఉందని.. పసుపు రేటు మరింత పెరుగుతుందని తెలిపారు. గత 2 ఏళ్లుగా పసుపు రైతులకు మేలు చేసేలా స్పైసీస్ బోర్డు, పసుపు బోర్డు పని చేస్తోందన్నారు. కేంద్రం పసుపు ఎగుమతులు పెంచటం ద్వారా రైతులకు మంచి ధరలు వస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోడీ చొరవతో పసుపు రైతులకు మేలు చేకూరనుందన్నారు. మోడీ (PM Modi) ప్రపంచ దిశానిర్దేశకుడన్నారు. రాజకీయ నాయకుడనే మాటకు అర్థాన్ని మార్చేసిన నేత మోడీ అని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 13 , 2024 | 03:57 PM

Advertising
Advertising