ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mavoist: బైరి నరేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ

ABN, Publish Date - Jan 08 , 2024 | 12:59 PM

ఏటూరునాగారంలో బైరి నరేష్‌పై జరిగిన దాడిని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఏటూరునాగారం-మహదేవపూర్ కమిటీ కార్యదర్శి సబిత పేరుతో మావోలు లేఖ విడుదల చేశారు. భీమకోరేగాం స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా జరిపే సభకు హాజరైన బైరి నరేష్ పై బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాదులు దాడి చేయడం అప్రజాస్వామికమని లేఖలో పేర్కొన్నారు.

వరంగల్ : ఏటూరునాగారంలో నాస్తికుడు బైరి నరేష్‌పై జరిగిన దాడిని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఏటూరునాగారం-మహదేవపూర్ కమిటీ కార్యదర్శి సబిత పేరుతో మావోలు లేఖ విడుదల చేశారు. భీమకోరేగాం స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా జరిపే సభకు హాజరైన బైరి నరేష్‌పై బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాదులు దాడి చేయడం అప్రజాస్వామికమని లేఖలో పేర్కొన్నారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి, దాడికి గురైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటికైనా దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని లేఖలో మావోలు డిమాండ్ చేశారు. పూజారి రాధాకృష్ణ సహా నాస్తికవాదులపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలన్నారు. దళితులు, మైనార్టీలపై దాడులు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది.

Updated Date - Jan 08 , 2024 | 01:17 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising