విజేత రంగారెడ్డి
ABN, Publish Date - Dec 30 , 2024 | 11:50 PM
జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదా నంలో జరుగుతున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి.
- ముగిసిన సీఎం కప్ కబడ్డీ పోటీలు
- రన్నర్‌గా నిలిచిన వనపర్తి, నల్గొండ
- విజేతలను అభినందించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదా నంలో జరుగుతున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి. సోమవారం ఇండోర్ స్టేడియం లో జరిగిన ఫైనల్‌లో మహిళ, పురుషుల విభాగంలో రంగారెడ్డి జట్టు చాంపియన్ నిలిచింది. పురుషుల వి భాగంలో ఫైనల్ మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు వనపర్తి పై 34-31, మహిళల విభాగంలో రంగారెడ్డి జట్టు నల్గొండపై 57-39తో గెలిచి విజేతగా నిలిచింది. పురు షుల విభాగంలో వనపర్తి, మహిళల విభాగంలో న ల్గొండ జట్లు రన్నర్‌గా నిలిచాయి. మూడో స్థానంలో పురుషు ల విభాగంలో నల్గొండ, మహిళ ల విభాగంలో హైదరాబా ద్ జట్టు ని లిచాయి. వి జేతలను రాష్ట్ర ప్రభు త్వ సలహా దారులు జితేందర్‌రెడ్డి విజేత జట్లను అభినందిం చారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. గ్రామీణ క్రీడాకారులను వె లుగులోకి తేవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రా మీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వ హించినట్లు తెలిపారు. త్వరలో విజేతలకు బహుమ తులు అందజేస్తారన్నారు. డీవైఎస్‌వో శ్రీనివాస్, ము నిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్పీ వెంకటేశ్, కు రుమూర్తిగౌడ్, బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు జా కీర్ అడ్వకేట్, వాలీబాల్ సంఘం ఆర్గనైజింగ్ సెక్ర టరీ చెన్నవీరయ్య, పాపరాయుడు, జిల్లా క్రీడా శాఖ కార్యాలయ సిబ్బంది రవీందర్‌రెడ్డి, విజయ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్‌లు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 11:50 PM