ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధి హామీపై కొనసాగుతున్న సామాజిక తనిఖీ

ABN, Publish Date - Dec 28 , 2024 | 11:02 PM

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ మండల స్థాయి సమావేశం కొనసాగుతోంది.

కోస్గిలో కొనసాగుతున్న సామాజిక తనిఖీ సమావేశం

కోస్గి రూరల్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ మండల స్థాయి సమావేశం కొనసాగుతోంది. శనివారం నారాయణపేట జిల్లా ఉపాధి హామీ పథకం పీడీ మొగులప్ప ఆధ్వర్యంలో కోస్గి మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉపాధి హామీ పనుల ఆడిట్‌ కొనసాగుతోంది. 2024-25 ఆ ర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు, వాటి బిల్లు ల వివరాలు తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఉపాధి హామీ మండల ఏపీవో వేణుగోపాల్‌రెడ్డి, ఉమ్మడి మండల ఈసీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లతో కలిసి ఆడిట్‌ నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగిన ఈ ఆడిట్‌లో 21 గ్రామ పంచాయతీలకు చెందిన వివరాలు జిల్లా అధికారులు నమోదు చేశారని ఇంకా ఐదు పంచాయతీల ఆడిట్‌ వివరాలు చేపట్టాల్సి ఉందన్నారు. శనివారం అర్ధరాత్రి వరకు ఆడిట్‌ కొనసాగే అవకాశముందని, వివరాలు ఆదివారం ప్రకటిస్తామని ఎంపీడీవో శ్రీధర్‌ తెలిపారు.

Updated Date - Dec 28 , 2024 | 11:02 PM