ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆలయాల పవిత్రతను కాపాడుకుందాం

ABN, Publish Date - Dec 22 , 2024 | 11:32 PM

ఆలయాల పవిత్రను కాపాడుకునేలా నిత్య పూజలతో పాటు ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక భావనతో ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు.

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల టౌన్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కుంటవీధిలో వెలసిన రుక్మిణి పాం డురంగస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆల యంలో ఏర్పాటు చేసిన నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాల అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే, దైవభక్తి ఉండటం ప్రతీ ఒక్కరికి అవసరమని, తద్వారా క్రమశిక్షణతో పాటు సత్‌ప్రవర్తన అలవడుతుందన్నారు. ఆలయాల పవిత్రను కాపాడుకునేలా నిత్య పూజలతో పాటు ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక భావనతో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గద్వాల మార్కెట్‌ కమిటీ మాజీచైర్మన్‌ గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్‌, మాజీ జడ్పీటీసీ సభ్యులు ప్రభాక ర్‌రెడ్డి, రాజశేఖర్‌, విక్రమసింహారెడ్డి, ఆంజనేయులు, గోవిందు, ధర్మనాయుడు ఉన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:32 PM