ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:39 PM
సొంతింటి కోసం ఏళ్లుగా ఎ దురుచూస్తున్న పేదల ఆశ లు ఫలించనున్నా యి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథ కం అమలుకు శ్రీకారం చుట్టింది.
- ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లు
- జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న సర్వే
- ఇప్పటి వరకు 45వేల 411 ఇళ్లు సర్వే పూర్తి
వనపర్తి అర్బన్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : సొంతింటి కోసం ఏళ్లుగా ఎ దురుచూస్తున్న పేదల ఆశ లు ఫలించనున్నా యి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథ కం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే కూడా జిల్లాలో వేగవంతంగా కొనసాగుతుంది. మొ దటి విడతలో సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్ధిక సహాయం మూడు విడతల్లో అందజేయనుం ది. ఇప్పటికీ జిల్లాలో గూడు లేక జీవనం కొన సాగిస్తున్న వారు తమ సొంత ఇంటి కల నెరవేరనుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ సొంతిల్లు లేక అనేక మంది పేద మధ్య తరగతి ప్రజలు కాలం వెల్లదీస్తు న్నా రు. వేలాది మంది ఇప్పటికీ అద్దె ఇళ్లల్లోనే జీ వనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాం లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తా మని చెప్పినప్పటికీ ఆచరణలో పూర్తిస్థాయిలో సాధ్యం కాలేదు. నిర్మించిన ఇళ్లలో కొంతమం దికి లక్కీ డిప్ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించారు. వాటిలో సరైన వసతులు లేక అలాగే కాలం వెళ్లదీస్తున్నారు.
లక్షా 42,075 దరఖాస్తులు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పథకం స్థానంలో గతంలో ఉన్న ట్లు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రక టించింది. ఈ మేరకు ప్రజా పాలన కార్యక్రమంలో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీ కరించింది. జిల్లా వ్యా ప్తంగా ప్రజా పాలనలో ఇళ్ల కోసం లక్ష 42వేల 75 దరఖాస్తులు వచ్చా యి. అయితే ఈ ఇళ్ల నిర్మాణాలతో పాటు ప్ర స్తుతం చేపడుతున్న స ర్వేకు సంబంధించి హౌ సింగ్ శాఖ పర్యవేక్షిస్తుం ది. అయితే ఇందిరమ్మ ఇళ్లను ప్రాధాన్యత క్ర మంలో కేటాయిం చనున్నారు. సొంత ఇంటి స్థలం కలిగిన అత్యంత నిరుపేదలకు మొద టి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీరిలో దళి తులు, గిరిజను లు, ఆదివాసులు, వ్యవసా య కూలీలు, పారిశుధ్య కార్మికులు, దివ్యాంగు లు, ట్రాన్స్‌జెండర్లకు ముందుగా ఇల్లు ఇస్తా మని ఇందిరమ్మ యాప్ ప్రారంభించి నప్పు డు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. లబ్ధిదారులు తమకున్న స్థలాన్ని గరిష్ట స్థాయి లో వినియోగించుకుని ఇల్లు నిర్మించుకునే లా ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఒక నమూ నా ఇంటిని నిర్మించి చూపించనున్నారు. ఈ న మూనా ఇంటికి సంబంధించి ఇప్పటికే ఎ మ్మెల్యే మేఘారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంపీడీ వో కార్యాలయ సమీపంలో భూమిపూజ కూ డా చేసి పనులు ప్రారంభించారు. ప్రతి ని యోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయిం చారు. ఒక్కో నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున మూడు విడతల్లో నిధులు ఇవ్వనున్నారు.
45వేల 411 ఇళ్ల సర్వే పూర్తి
జిల్లాలో ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సిబ్బం ది సర్వే చేపడుతున్నారు. ఇందిరమ్మ యాప్ లో ఏడు ప్రశ్నలున్నాయి. ఇందులో భూమి ఉందా? ఏం చేస్తుంటారు? కుటుంబ సభ్యుల సంఖ్య, ప్రస్తుత ఇల్లు, పైకప్పు, ఇంటి లోపల మూడు రకాల ఫొటోలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 9న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ప్రారంభించారు. ఇప్పటి వరకు 45వేల 411 ఇళ్లు సర్వే పూర్తి చేశారు. ప్రతి రోజు ఒక సర్వేయర్ సుమారుగా 25 ఇళ్లపైనే సర్వే చేస్తున్నారు. నెల రోజుల్లో సర్వే పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది.
Updated Date - Dec 20 , 2024 | 11:39 PM