దేవరకద్రను అన్ని విధాలా అభివృద్ధి చేస్తా
ABN, Publish Date - Dec 24 , 2024 | 11:37 PM
దేవరకద్రను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి
దేవరకద్ర, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : దేవరకద్రను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కోర్టు భవనం, డిగ్రీ కళాశాల, బస్టాండ్, వంద పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించి, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంత్సరంలోపు ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దేవరకద్రకు అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలను మంజూరు చేయిస్తానన్నారు. త్వరలోనే కోర్టు ఏర్పాటు చేసి ఐదు మండలాల ప్రజల సముస్యలు తీరుస్తామన్నారు. డిగ్రీ కళాశాల, వంద పడకల ఆసుపత్రి, అండర్ పాస్ బ్రిడ్జి, బస్టాండ్‌ను కూడా నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెకట్రరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, మండల అధ్యక్షుడు అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, దేవస్థాన చైర్మన్ నరసింహరెడ్డి, పట్ణణ అధ్యక్షుడు ఫారుక్‌అలీ, మండల నాయకులు లక్ష్మికాంత్‌రెడ్డి, గోవర్దన్ రెడ్డి, ఆదిహన్మంతురెడ్డి, కొండ అంజన్‌కుమార్‌రెడ్డి, హన్మంతురెడ్డి, గోపాల్, భరత్‌కుమార్, ప్రేమ్‌కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, డీటీ దీపిక పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 11:37 PM