ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దళిత హెచ్‌ఎంపై దాడికి నిరసన

ABN, Publish Date - Dec 30 , 2024 | 11:12 PM

దళిత హెచ్‌ఎం రాములుపై దాడికి నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు.

జడ్చర్లలో నిరసన వ్యక్తం చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

పాలమూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : దళిత హెచ్‌ఎం రాములుపై దాడికి నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో టీపీఎస్‌కే జిల్లా కార్యదర్శి వి.కురుమూర్తి, సీఐటీయూ నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ దళితులపై దాడులను సహించమన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, తుక్కుగూడ గ్రామంలో గెజిటెడ్‌ హెచ్‌ఎం రాములుపై ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, పరివార్‌ సంస్థలకు చెందిన వారు చేసిన దాడిని సమాజమంతా ఖండించాలన్నారు. దాడిచేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలన్నారు. డీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఆదిత్య, ఐద్యా కన్వీనర్‌ వి.పద్మ ఖండించారు. కార్యక్రమంలో గాలెన్న, మోహన్‌,ఏ.రాములు, సుమిత్రి, సుశీల, రాజుకుమార్‌లు పాల్గొన్నారు.

దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి

జడ్చర్ల : దళిత ప్రధానోపాధ్యాయుడిపై కులం పేరుతో దూషించి, భౌతిక దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ జడ్చర్ల అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష పోరాట సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగుడ ప్రధానోపాధ్యాయుడు రాములుపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. సంఘం నాయకులు జగన్‌, నాగరాజు, లక్ష్మీదేవి, శంకర్‌, సుందరమ్మ, వెంకటయ్య, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:12 PM