ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బెడిసి కొట్టిన దొంగల వ్యూహం

ABN, Publish Date - Dec 30 , 2024 | 11:21 PM

పక్కా ప్లాన్‌ చేశారు. కానీ దొంగల వ్యూహం ఫ లించలేదు.

అమరచింత యూనియన్‌ బ్యాంకు బ్రాంచి వద్ద విచారణ చేస్తున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు

- బ్యాంకు స్ర్టాంగ్‌ రూమ్‌ లాకర్‌

రాకపోవడంతో వెనుదిరిగిన

దొంగలు

- వెనకి కిటికీ గ్రిల్‌ తొలగించి

లోపలికి ప్రవేశం

- బ్యాంకులోని సీసీ పుటేజీ

హార్డిస్క్‌ ఎత్తుకెళ్లిన దొంగలు

అమరచింత, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : పక్కా ప్లాన్‌ చేశారు. కానీ దొంగల వ్యూహం ఫ లించలేదు. అసలైన స్ర్టాంగ్‌ రూమ్‌ లాకర్‌ తెర వడానికి రాకపోవడంతో వ్యూహం ఫలించక దొం గలు పరారైన ఘటన సోమవారం వనపర్తి జిల్లా అమరచింత యూనియన్‌ బ్యాంకు బ్రాంచి వెలు గులోకి వచ్చింది. ప్రతీ రోజులాగే ఉదయం బ్యాంకు సమయానికి సిబ్బంది, అధికారులు బ్యా ంకు వద్దకు వచ్చి తెరిచారు. బ్యాంకు లోపల ను ంచి వెనుక భాగంలో ఉన్న కిటికీ అద్దాలు పగిలి నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు బ్యాంకు లోని పేపర్లు, ఫైల్స్‌ అటు ఇటుగా పడి ఉండటం తో అనుమానం వచ్చిన అధికారులు వెంటనే బ్యా ంకు ప్రధాన ద్వారం మూసివేసి క్షుణ్ణంగా పరిశీ లించారు. లాకర్‌ డోర్‌ మూసి ఉన్నప్పటికీ కిటికీ, సీసీ పుటేజీ వైర్లు కట్‌ చేసి ఉండటం, సీసీ పు టేజీ హార్డిస్క్‌ కనపడకపోవడంతో వెంటనే పోలీ సులకు సమాచారం అందించారు. బ్యాంక్‌కు శని వారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సె లవు కావడంతో అదే అదునుగా భావించిన దొం గలు బ్యాంకు వెనుక భాగంలోని బాత్రూం ప క్కన ఉన్న కిటికీ అద్దాలు పగులగొట్టారు. కిటికీ ఇనుప గ్రిల్‌ను తొలగించి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు మొదట సీసీ పు టేజి కి సంబంధించిన హార్డిస్క్‌ను తీసుకొని లాక ర్‌ గది తెరవడానికి విఫల ప్రయత్నం చేశారు. తీ రా లాకర్‌ డోర్‌ రాకపోవడంతో కేవలం సీసీ పు టేజీకి సంబంధించిన హార్డిస్క్‌ మాత్రమే ఎత్తుకెళ్లి నట్లు బ్యాంకు అధికారులు, పోలీసులు తెలిపారు.

క్లూస్‌ టీ ం జాగిలాలతో తనిఖీ

యూనియన్‌ బ్యాంకులో దొంగల పడ్డారని తెలిసిన వెంటనే వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరా వు, సీఐ శివకుమార్‌, క్రైమ్‌ బ్రాంచ్‌ సీఐ రవిపా ల్‌, ఎస్‌ఐ సురేష్‌, క్లూస్‌ టీమ్‌ ఎస్‌ఐ రవి సాగర్‌, క్రైమ్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ జయన్న హుటాహుటిన బ్యాంకు వద్దకు చేరుకున్నారు. వెంటనే జాగిలాల ను ఫింగర్‌ ప్రింట్‌ అధికారులను రప్పించి బ్యాం కు లోపల విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా దొంగలు ఎంత ప్రయత్నించినా బ్యాంకులో ఎలా ంటి దొంగతనం జరగలేదని బ్యాంకు మేనేజర్‌ శివకుమార్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు.

Updated Date - Dec 30 , 2024 | 11:21 PM