ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Minister Jupally: ఆత్మసాక్షి ఉంటే హరీశ్‌రావు రాజీనామా చేయాలి

ABN, Publish Date - Feb 17 , 2024 | 04:26 PM

సాగునీటి రంగంపై తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం నాడు శ్వేతపత్రం విడుదల చేసింది. నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై (BRS Govt) మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: సాగునీటి రంగంపై తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం నాడు శ్వేతపత్రం విడుదల చేసింది. నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై (BRS Govt) మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఎక్కడా అవినీతి జరగలేదని చెప్పారని.. అవినీతి జరిగిందో లేదో మాజీమంత్రి హరీశ్‌ రావు ఆత్మసాక్షిగా చెప్పాలని ప్రశ్నించారు.

నీటిపారుదల రంగంలో రూ.1.8 లక్షల కోట్లతో టెండర్లు చేపట్టారని చెప్పారు. ఈ విషయంలో లోగుట్టు మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావుకు తెలియదా? అని ప్రశ్నించారు. అవినీతి జరగలేదని రుజువు చేయాలని.. ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పకుండా ఎలా తప్పించుకుంటారని నిలదీశారు. రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు కాదుగా? అని ప్రశ్నించారు. ఆత్మసాక్షి ఉంటే హరీశ్‌రావు రాజీనామా చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు.

Updated Date - Feb 17 , 2024 | 04:26 PM

Advertising
Advertising