ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ఎన్నికల భద్రత కట్టుదిట్టం.. ఓటింగ్ పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్న రొనాల్డ్ రోస్

ABN, Publish Date - Mar 16 , 2024 | 09:12 PM

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొత్తంగా 45,70,138 మంది ఓటర్లున్నట్లు చెప్పారు.

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొత్తంగా 45,70,138 మంది ఓటర్లున్నట్లు చెప్పారు.

ఆయన మాట్లాడుతూ.. "నామినేషన్ చివరి తేదీ వరకు ఓటర్‌గా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. 85 ఏళ్లు నిండిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుండి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నాం. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 3,986 పోలింగ్ బూత్‌లున్నాయి. సీ విజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100నిమిషాల్లో పరిష్కారం కల్పిస్తాం" అని రోస్ అన్నారు.

18 చెక్ పోస్ట్‌లు..

లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో భద్రత కట్టుదిట్టం చేశామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 18 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. నగదు తరలింపుపై నిరంతరం నిఘా ఉంచుతామని చెప్పారు.

Updated Date - Mar 16 , 2024 | 09:15 PM

Advertising
Advertising