Hyderabad: నటి పావల శ్యామలకు ఆర్థిక సాయం
ABN, Publish Date - Jan 05 , 2024 | 11:12 AM
అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీనియర్ నటి పావల శ్యామల(Pawala Syamala)కు మనం సైతం ఫౌండేషన్ అండగా నిలబడింది.
బంజారాహిల్స్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీనియర్ నటి పావల శ్యామల(Pawala Syamala)కు మనం సైతం ఫౌండేషన్ అండగా నిలబడింది. సంస్థ నిర్వాహకుడు కాదంబరి కిరణ్ శివారు ప్రాంతాల్లో వృద్దాశ్రమంలో ఉంటున్న ఆమెను కలిసి గురువారం 25 వేల రూపాయల చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ ఆర్ధిక అవసరాలు, అనారోగ్యం బారిన పడ్డ వారి వివరాలు తెలుసుకొని వారికి మనం సైతం అండగా నిలుస్తుందని తెలిపారు. సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేసేందుకు ఫౌండేషన్‌ను స్థాపించినట్టు చెప్పారు.
Updated Date - Jan 05 , 2024 | 11:12 AM