ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Madhapur PS: మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. కారణం ఇదే!

ABN, Publish Date - Jan 22 , 2024 | 09:33 PM

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ వెనుకవైపు సీజ్ చేసి ఉన్న సిలిండర్స్‌లో మంటలు చెలరేగడంతో.. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో.. పోలీసు సిబ్బంది భయంతో వెంటనే పరుగులు తీసింది.

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ వెనుకవైపు సీజ్ చేసి ఉన్న సిలిండర్స్‌లో మంటలు చెలరేగడంతో.. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో.. పోలీసు సిబ్బంది భయంతో వెంటనే పరుగులు తీసింది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్టు తెలిసింది.


అసలు సిలిండర్లలో మంటలు ఎలా చెలరేగాయన్న కోణంలో విచారించగా.. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఆలయం సమీపంలో స్థానికులు టపాసులు పేల్చారని, దీంతో నిప్పు రవ్వులు పీఎస్ వెనుక భాగంలో ఉన్న సిలిండర్ల మీద పడినట్టు తెలిసింది. రెండు సిలిండర్లు పేలడంతో.. మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఫర్నిచర్‌తో పాటు పాత సామాన్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు కానీ, ఆస్తినష్టం బాగా జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసింది.

Updated Date - Jan 22 , 2024 | 09:33 PM

Advertising
Advertising