కొండగట్టులో పేరుకే హరితహోటల్
ABN, Publish Date - Dec 24 , 2024 | 01:17 AM
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం పరిధిలో కొండపైన పదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరిత హోటల్ పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదు.
ఫ గదుల అద్దెకే పరిమితం
ఫ టిఫిన్స్, భోజనం దొరక్క భక్తుల పాట్లు
మల్యాల, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం పరిధిలో కొండపైన పదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరిత హోటల్ పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదు. గదుల అద్దెతో పాటు హోటల్ నిర్వహణ అందుబాటులో ఉంటూ కొండపైకి స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు టీ, టిఫిన్స్, బోజనం అందించాల్సి ఉండగా కొన్నేళ్లుగా హోటల్ నిర్వహించడం లేదు. దీంతో హరిత హోటల్ ఉందని వచ్చే భక్తులు బోజనం, టిఫిన్స్ దొరక్క తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. హరిత హోటల్ మొదటి, రెండవ అంతస్తులో పది గదులు అద్దెకు ఇస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్‌లో హోటల్ నిర్వహించే వారు. అయితే ఇప్పుడు హోటల్ అందుబాటులో లేదు. కరోనా కాలం నుంచి హోటల్ మూలన పడగా ఓ ఏడాది పాటు స్థానికులు లీజుకు తీసుకున్నారు. లీజు సొమ్ములు ఎక్కువ అవుతున్నాయని గిట్టుబాటు కావడం లేదని లీజుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇక పది గదులలో 8 ఏసీ, 2 సాధారణం గదులు కాగ అవి కూడా కొండపైన భక్తుల రద్దీ ఉన్నప్పుడే ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నట్లు నిర్వహకులు తెలిపారు.
Updated Date - Dec 24 , 2024 | 01:17 AM