Kumaram Bheem Asifabad: ఎస్సీ వర్గీకరణను అడ్డుకుందాం
ABN, Publish Date - Dec 27 , 2024 | 10:40 PM
పెంచికలపేట, డిసెంబరు 27(ఆంధ్ర జ్యోతి): ఎస్సీ వర్గీకరణను అడ్డుకుందామని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని మాలమహానాడు జాతీయఅధ్యక్షుడు డాక్టర్ పసుల రాంమూర్తి అన్నారు.
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రాంమూర్తి
పెంచికలపేట, డిసెంబరు 27(ఆంధ్ర జ్యోతి): ఎస్సీ వర్గీకరణను అడ్డుకుందామని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని మాలమహానాడు జాతీయఅధ్యక్షుడు డాక్టర్ పసుల రాంమూర్తి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కొండపల్లి గ్రామంలో జెండా మహోత్సవ కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయా లతో మాలలంతా ఐకమత్యంతో ఉండాల న్నారు. రాజకీయ లబ్ధికోసం కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు అవలంభిస్తున్న తీరును మాలలంతా ఐకమత్యంతో అడ్డుకు నేందుకు ముందుకు రావాలన్నారు. ఎస్సీ వర్గీ కరణ జరిగితే రిజర్వేషన్లు కోల్పోయి విద్య, ఉద్యోగ, అవకాశాలు కోల్పోతామన్నారు. కార్య క్రమంలో రాష్ట్రఅధ్యక్షుడు సుదీర్, పుల్లయ్య, యాదగిరి, కిష్టయ్య, పురుష్తోం, మధుబాబు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 27 , 2024 | 10:40 PM