ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి

ABN, Publish Date - Dec 30 , 2024 | 11:07 PM

ఆసిఫాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లసర్వే ప్రక్రియను సమర్థవంతంగా న్విహించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ గౌతమ్‌ అన్నారు.

- రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ గౌతమ్‌

ఆసిఫాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లసర్వే ప్రక్రియను సమర్థవంతంగా న్విహించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ గౌతమ్‌ అన్నారు. సోమవారం హైద రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, మున్సిపల్‌ కమిషనర్లు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియలో సేకరించిన వివరాలు యాప్‌లో నమోదు చేయడం, ఇతర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతినియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిందన్నారు.

ఈ క్రమంలో చేపట్టే ఇందిరమ్మ ఇళ్లసర్వేను సమర్థవంతంగా నిర్వహిం చాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లసర్వే పకడ్బందీగా కొనసాగుతోంందని తెలిపారు. సర్వే సిబ్బంది ప్రతిఇంటికి వెళ్లి దరఖాస్తుదారుల ఫొటోలు, ఇంటి యజమానుల వివరాలు సేకరించి ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తున్నారని తెలిపారు.

ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సేకరించిన వివరాలను స్పష్టంగా నమోదుచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ ఎం డేవిడ్‌, మున్సిపల్‌ మున్సిపల్‌ కమిషనర్‌లు భుజంగరావు, అంజయ్య, హౌజింగ్‌ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:07 PM