Kumaram Bheem Asifabad: సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి: ఎస్పీ
ABN, Publish Date - Dec 30 , 2024 | 11:04 PM
ఆసిఫాబాద్, డిసెంబరు 30(ఆంధ్ర జ్యోతి): నూతనసంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు.
- ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
ఆసిఫాబాద్, డిసెంబరు 30(ఆంధ్ర జ్యోతి): నూతనసంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబరు31న జిల్లా వ్యాప్తంగా విస్తృతతనిఖీలు నిర్వహిస్తామ న్నారు. జిల్లా పరిధిలోని స్థానికపోలీసులతో పాటు ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, షీటీంలతో పాటు పెట్రోలింగ్ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారన్నారు. అర్ధరాత్రి 12.30 గంటలలోపు వేడుకలు ముగించాలన్నారు. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే డయల్100కు సమాచారం అందించాలన్నారు. 2025సంవత్స రంలో ప్రజలందరికీ మంచికలగాలని ఆశిస్తూ జిల్లా ప్రజలకు, పోలీసు శాఖ తరపున నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Dec 30 , 2024 | 11:04 PM