ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్స్.. ప్రొఫైల్ పిక్ సేవింగ్, పేమెంట్స్‌పై కీలక అప్‌డేట్స్..!

ABN, Publish Date - Mar 19 , 2024 | 06:12 PM

వాట్సాప్ పేమెంట్స్ సేవలు ప్రారంభించి చాలా రోజులే అయినప్పటికీ వినియోదారుల నుంచి వస్తున్న ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. దీనిని మెరుగుపరిచేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది.

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న వాట్సాప్ (WhatsApp) త్వరలో మరో కొత్త ఫీచర్ తీసుకురాబోతోంది. వాట్సాప్ ఇప్పటికే పేమెంట్స్ (WhatsApp Payments) సేవలు ప్రారంభించింది. ఈ పేమెంట్స్ సేవలు ప్రారంభించి చాలా రోజులే అయినప్పటికీ వినియోదారుల నుంచి వస్తున్న ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. వాట్సాప్ అందిస్తున్న మిగిలిన అన్ని సేవలను వినియోగించుకుంటున్న వారు పేమెంట్స్ విషయానికి వచ్చేసరికి సంకోచిస్తున్నారు.

వినియోదారులను పేమెంట్స్ వైపు కూడా ఆకర్షించేందుకు వాట్సాప్ త్వరలో సరికొత్త ఫీచర్‌ను అందించబోతోంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగు పరిచేలా కొత్త ఫీచర్ ఉండబోతోంది. ప్రస్తుతం వాట్సాప్ నుంచి పేమెంట్ చేయాలంటే పైన ఉండే త్రీ డాట్స్‌పై క్లిక్ చేసి పేమెంట్స్ మెనూలోకి వెళ్లి పేమెంట్స్ చేయాలి. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఛాట్ లిస్ట్ నుంచే పేమెంట్ ప్రక్రియ పూర్తి చెయ్యవచ్చు. వాట్సాప్ బ్యానర్, కెమేరా సింబల్ మధ్యలో కొత్తగా క్యూఆర్ కోడ్ స్కానర్‌ను సెట్ చేయబోతున్నారు. ఆ స్కానర్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి యూపీఐ (UPI Payments) ఖాతాకు లింక్ అయి ఉన్న అకౌంట్ నుంచి పేమెంట్ పూర్తి చేయవచ్చు.

అలాగే కొంతమంది మీకు తెలియకుండానే మీ ప్రొఫైల్ ఫొటోని (WhatsApp profile photo) సేవ్ చేసుకోవడం లేదా స్క్రీన్ షాట్ తీయడం వంటివి చేస్తారు. అలాగే చాట్‌లు కూడా స్క్రీన్ షాట్లు తీస్తుంరు. ఇకపై వాట్సాప్ అలాంటి వాటిని అనుమతించదు. ఈ కొత్త ఫీచర్లో ఎవరైనా వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌ని స్క్రీన్ షాట్ తీస్తే, వారికి ప్రొఫైల్ ఫొటో స్థానంలో నలుపు రంగు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు మాత్రమే ఈ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మిగిలిన యూజర్లందరికీ ఈ ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫీచర్ ద్వారా యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపడుతుందని వాట్సాప్ ప్రతినిధులు భావిస్తున్నారు.

Updated Date - Mar 19 , 2024 | 06:12 PM

Advertising
Advertising