ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

POCO: తక్కువ ధరకే.. 108MP కెమెరా 5జీ స్మార్ట్‌ఫోన్

ABN, Publish Date - Mar 13 , 2024 | 03:57 PM

POCO నుంచి కొత్తగా ఈరోజు (మార్చి 13న) X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ మోడల్ దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేయబడింది. బడ్జెట్ ధరల్లో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 108MP కెమెరా, 12GB RAM వంటి అదిరిపోయే ఫీచర్లతో వస్తుంది.

POCO నుంచి కొత్తగా ఈరోజు (మార్చి 13న) X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ మోడల్ దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేయబడింది. బడ్జెట్ ధరల్లో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 108MP కెమెరా, 12GB RAM వంటి అదిరిపోయే ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ, మార్టిన్ ఆరెంజ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. POCO X6 నియో 5G రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో(8GB RAM + 128GB, 12GB RAM + 256GB) ప్రారంభించబడింది.

దీని బేస్ వేరియంట్ ధర రూ. 15,999 ఉండగా, టాప్ వేరియంట్ రూ.17,999కి లభిస్తుంది. ఈ ఫోన్ ముందస్తు సేల్ అంటే మార్చి 13, 2024న సాయంత్రం 7 గంటలకు ఇ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో మొదలుకానుంది. ఈ మొదటి సేల్‌లో వినియోగదారులకు రూ. 1,000 ఫ్లాట్ తగ్గింపును అందిస్తున్నారు. ఈ ఫోన్ రెగ్యులర్ సేల్ మార్చి 18న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.


ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే ప్రకాశం గరిష్టంగా 1000 నిట్‌ల వరకు ఉండగా, ఈ ఫోన్ MediaTek Dimensity 6080 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు 33W USB టైప్ C ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఈ బడ్జెట్ ఫోన్ IP54 వాటర్, డస్ట్ రెసిస్టెంట్, కనెక్టివిటీ కోసం 3.5mm ఆడియో జాక్, USB టైప్ C పోర్ట్, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. 108MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉంది. ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్ లైట్, ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP కెమెరా వంటి ఫీచర్లు కలవు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Jan Aushadhi Kendra: జన్ ఔషధి కేంద్రం ప్రారంభించే వారికి గుడ్ న్యూస్

Updated Date - Mar 13 , 2024 | 03:57 PM

Advertising
Advertising