OnePlus 12: ఈ నెల 23న భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 12 ఫోన్లు.. ధర, ఇతర వివరాలు ఇవే!
ABN, Publish Date - Jan 10 , 2024 | 06:56 PM
ఆండ్రాయిడ్ ఫోన్లలో వన్‌ప్లస్ మొబైల్స్‌కు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పటికే వన్‌ప్లస్ రిలీజ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు చాలా వరకు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. త్వరలో వన్‌ప్లస్ 12 సిరీస్ మోడళ్లు భారత మార్కెట్లో విడుదల కాబోతున్నాయి. ఈ ఫోన్లు ఇప్పటికే చైనాలో విడుదలయ్యాయి.
ఆండ్రాయిడ్ ఫోన్లలో వన్‌ప్లస్ మొబైల్స్‌కు (OnePlus) మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పటికే వన్‌ప్లస్ రిలీజ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు చాలా వరకు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. త్వరలో వన్‌ప్లస్ 12 సిరీస్ మోడళ్లు భారత మార్కెట్లో విడుదల కాబోతున్నాయి. ఈ ఫోన్లు ఇప్పటికే చైనాలో విడుదలయ్యాయి. ఈ నెల 23న భారత్ మార్కెట్లోకి రానున్నాయి. ఈ సిరీస్‌లో వన్‌ప్లస్12 (OnePlus 12), వన్‌ప్లస్ 12 ఆర్ (OnePlus 12R) ఫోన్లు ఉంటాయి.
స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్‌సెట్, 100 వాట్స్ సూపర్ వూక్ చార్జింగ్, 50 వాట్స్ వైర్‌లెస్ చార్జింగ్, 10 వాట్స్ రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్‌తో, 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో ఈ ఫోన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. చైనాలో వన్‌ప్లస్ 12 ఫోన్ ప్రారంభ ధర 4,299 యువాన్లు (రూ.50,700). ట్రిపుల్ కెమేరా సెటప్‌తో, ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. 6.82 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
వన్‌ప్లస్ 12లో వెనుక వైపు సోనీ LYT-808 సెన్సార్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయి. 3x ఆప్టికల్ జూమ్, 6x ఇన్-సెన్సర్ జూమ్, గరిష్టంగా 120x డిజిటల్ జూమ్ ఉంటాయి. అలాగే ముందు వైపు 32MP సోనీ IMX615 సెన్సార్‌తో కూడా కెమేరా ఉంటుంది. ఇక వన్ ప్లస్ 12 ఆర్ మొబైల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుందని లీక్‌లు వస్తున్నాయి.
Updated Date - Jan 10 , 2024 | 06:56 PM