ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KL Rahul: లఖ్‌నవూ టీమ్‌కు గుడ్ న్యూస్.. పూర్తి ఫిట్‌గా కేఎల్ రాహుల్..!

ABN, Publish Date - Mar 18 , 2024 | 08:48 PM

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్‌కు గుడ్ న్యూస్. పూర్తి ఫిట్‌గా మారిన ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ త్వరలో జట్టుతో పాటు కలవబోతున్నాడు.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) టీమ్‌కు గుడ్ న్యూస్. పూర్తి ఫిట్‌గా మారిన ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) త్వరలో జట్టుతో పాటు కలవబోతున్నాడు. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్-2024 (IPL-2024) సీజన్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ రాకపై సస్పెన్స్ నెలకొంది. ఆ సస్పెన్స్‌కు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) తాజాగా తెర దించింది.

రాహుల్ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించినట్టు జాతీయ క్రికెట్ అకాడమీ తెలిపింది. దీంతో రాహుల్ ఐపీఎల్ ఆడేందుకు మార్గం సుగమమైంది. అయితే టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లు కొన్నింట్లో రాహుల్ కీపింగ్‌కు దూరంగా ఉండాలని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే బరిలోకి దిగాలి తప్ప, వికెట్ కీపింగ్ చేయవద్దని సూచన చేసింది. మరో రెండ్రోజుల్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్‌తో రాహుల్ కలవబోతున్నాడు. మార్చి 24వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో లఖ్‌నవూ తొలి మ్యాచ్ ఆడబోతోంది.

ఇంగ్లండ్ టెస్ట్ సమయంలో రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో టెస్ట్ సిరీస్ నుంచి వైదొలగిన రాహుల్ నేరుగా ఇంగ్లండ్ వెళ్లాడు. అక్కడ ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో చికిత్స అందుకున్నాడు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. అక్కడ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు.

Updated Date - Mar 18 , 2024 | 08:48 PM

Advertising
Advertising