ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మనూ భాకర్‌కు ఖేల్‌రత్న?

ABN, Publish Date - Dec 26 , 2024 | 05:37 AM

ఈ ఏడాది ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు జాబితాలో స్టార్‌ షూటర్‌ మనూ భాకర్‌ పేరు లేకపోవడం పెద్ద వివాదం సృష్టించింది. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలిసింది...

జాబితాలో చేర్చనున్న క్రీడా శాఖ

న్యూఢిల్లీ: ఈ ఏడాది ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు జాబితాలో స్టార్‌ షూటర్‌ మనూ భాకర్‌ పేరు లేకపోవడం పెద్ద వివాదం సృష్టించింది. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఖేల్‌రత్న పురస్కారాల నామినేటెడ్‌ జాబితాలో మనూ భాకర్‌ పేరు చేర్చనున్నట్టు ఆ శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని 12 మంది సభ్యుల కమిటీ క్రీడా అవార్డులకు అథ్లెట్లను ఎంపిక చేయనుంది. ఇక ఈసారి ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డుకు పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, పారిస్‌ పారా ఒలింపిక్స్‌ హైజం్‌పలో స్వర్ణం నెగ్గిన ప్రవీణ్‌ కుమార్‌ తదితరుల పేర్లను సిఫారసు చేశారు.

Updated Date - Dec 26 , 2024 | 05:37 AM