ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ravindra Jadeja: నువ్వు మీసం లేని రజినీ.. నేను మీసం ఉన్న రజినీ.. అశ్విన్‌పై జడేజా ఫన్నీ కామెంట్స్!

ABN, Publish Date - Mar 17 , 2024 | 07:41 PM

రవి చంద్రన్ అశ్విన్ టెస్ట్‌ల్లో 500కు పైగా వికెట్లు తీశాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో అశ్విన్‌ది గొప్ప కాంబినేషన్. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో వీరిద్దరిదీ విజయవంతమైన బౌలింగ్ జోడీగా నిలిచింది.

వంద టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మరో అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. టెస్ట్‌ల్లో 500కు పైగా వికెట్లు తీశాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో అశ్విన్‌ది గొప్ప కాంబినేషన్. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో వీరిద్దరిదీ విజయవంతమైన బౌలింగ్ జోడీగా నిలిచింది. వీరిద్దరూ కలిసి ఆడిన మ్యాచ్‌ల్లో 500కు పైగా వికెట్లు తీసి అనిల్ కుంబ్లే-హర్భజన్ సింగ్ ద్వయాన్ని అధిగమించారు.

ఎన్నో ఘనతలు సాధించిన అశ్విన్‌ను తాజాగా తమిళనాడు క్రికెట్ సంఘం సన్మానించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అశ్విన్‌పై జడేజా ప్రశంసలు కురిపించాడు. ``హాయ్ అశ్విన్ భాయ్.. వంద టెస్ట్‌లు ఆడినందుకు, 500 వికెట్లు తీసినందుకు నీకు అభినందనలు. భవిష్యత్తులో కూడా నీ జోరు ఇలాగే కొనసాగాలి. నాకు ఎప్పుడూ సూచనలు ఇస్తూనే ఉండాలి. నేను కూడా మెరుగైన ప్రదర్శన చేసి నీ స్థాయికి చేరుతాన`ని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా 1981లో విడుదలైన రజినీకాంత్ (Rajinikanth) సినిమాలోని థిల్లు-ముల్లు క్యారెక్టర్లను పోల్చుతూ కామెంట్ చేశాడు. ``మనిద్దరి భాగస్వామ్యం చూస్తుంటే నాకు ఓ సినిమా గుర్తుకొస్తోంది. మన ఇద్దరి పేర్లు ఒకటే. నేను రవి ఇంద్రన్, నువ్వేమో రవిచంద్రన్. నువ్వు మీసం లేని చంద్రన్, నేను మీసమున్న ఇంద్రన్`` అని సరదాగా పేర్కొన్నాడు.

Updated Date - Mar 17 , 2024 | 07:41 PM

Advertising
Advertising