ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హష్మతుల్లా ద్విశతకం

ABN, Publish Date - Dec 31 , 2024 | 06:11 AM

భారీ స్కోర్లతో హోరెత్తిన జింబాబ్వే-అఫ్ఘానిస్థాన్‌ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అఫ్ఘాన్‌ ఇన్నింగ్స్‌లో రెండు డబుల్‌ సెంచరీలు నమోదు కావడం విశేషం. మూడో రోజు ఆటలో రహ్మత్‌ షా (234) ఈ ఫీట్‌ సాధించగా...

అఫ్ఘాన్‌తో జింబాబ్వే టెస్టు డ్రా

బులవాయో: భారీ స్కోర్లతో హోరెత్తిన జింబాబ్వే-అఫ్ఘానిస్థాన్‌ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అఫ్ఘాన్‌ ఇన్నింగ్స్‌లో రెండు డబుల్‌ సెంచరీలు నమోదు కావడం విశేషం. మూడో రోజు ఆటలో రహ్మత్‌ షా (234) ఈ ఫీట్‌ సాధించగా.. ఆఖరి రోజైన సోమవారం కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (246) కూడా ద్విశతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో అఫ్ఘాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 699 పరుగుల భారీ స్కోరు సాధించింది. టెస్టుల్లో ఈ జట్టుకిదే అత్యధిక స్కోరు. అఫ్సర్‌ జజాయ్‌ (113) శతకం బాదాడు. నాలుగో వికెట్‌కు షాహిది-అఫ్సర్‌ 211 రన్స్‌ జోడించారు. అయితే 20 పరుగుల వ్యవధిలోనే చివరి ఆరు వికెట్లు నేలకూలాయి. ఆ తర్వాత 113 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన జింబాబ్వే 142/4 స్కోరు సాధించింది. ఆటకు మరో గంట సమయం ఉండగా ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 586 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Dec 31 , 2024 | 06:11 AM