ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gorakhpur Case: రాత్రి పేరెంట్స్‌కి నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో రొమాన్స్.. చివరికి ఏమైందంటే?

ABN, Publish Date - Jan 05 , 2024 | 07:21 PM

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక అనూహ్యమైన కేసు వెలుగు చూసింది. రాత్రిపూట తన ప్రియుడితో రొమాన్స్ చేసేందుకు ఓ యువతి తన తల్లిదండ్రులకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చేది. ఈ వ్యవహారం మూడు నెలలపాటు

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక అనూహ్యమైన కేసు వెలుగు చూసింది. రాత్రిపూట తన ప్రియుడితో రొమాన్స్ చేసేందుకు ఓ యువతి తన తల్లిదండ్రులకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చేది. ఈ వ్యవహారం మూడు నెలలపాటు సాగింది. కానీ.. ఆ తర్వాత ఆ యువజంట అడ్డంగా దొరికిపోయారు. ఇరుగుపొరుగు వారు ఇచ్చిన ఫిర్యాదుతో బాలిక తల్లిదండ్రులు చాకచక్యంగా వ్యవహరించి.. తమ కుమార్తె ప్రియుడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడ్ని ఇంట్లో బంధించి చితకబాదారు. చివరికి ఈ వివాదం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


గోరఖ్‌పూర్ జిల్లాలోని తివారీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10వ తరగతి చదువుతున్న ఓ బాలిక (16) తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఈ అమ్మాయి అధ్యార్యాబాగ్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువకుడ్ని చాలాకాలంగా ప్రేమిస్తోంది. అయితే.. ఏకాంతంగా గడిపేందుకు ఈ యువజంటకి అవకాశం దొరకలేదు. ఈ క్రమంలోనే యువకుడు ఓ పన్నాగం పన్నాడు. రాత్రి తల్లిదండ్రుల భోజనంలో నిద్రమాత్రలు కలపమని చెప్పి.. మెడిసిన్స్ ఇచ్చాడు. అతడు చెప్పినట్టుగానే.. ఆ అమ్మాయి రోజూ భోజనంలో నిద్రమాత్రలు వేయడం ప్రారంభించింది. దాంతో వాళ్లు గాఢ నిద్రలోకి జారిపోయేవారు. అప్పుడు యువకుడు బాలిక ఇంట్లోకి దూరి, ఆమెతో రొమాన్స్ చేసేవాడు. కాసేపయ్యాక తిరిగి తన ఇంటికి వెళ్లిపోయేవాడు. ఇలా మూడు నెలల పాటు ఈ వ్యవహారం సాగింది.

అయితే.. ఇరుగుపొరుగు వారు ఇది గమనించి, రోజూ ఆ అబ్బాయి ఇంటికొస్తున్న విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో తండ్రికి అనుమానం వచ్చి, బుధవారం రాత్రి భోజనం చేయకుండా యువకుడి రాక కోసం వేచి చూశాడు. అర్థరాత్రి దాటాక యువకుడు రాగానే.. లోపల నుంచి డోర్‌కి తాళం వేసి, అతడ్ని నిర్భంధించి, కుటుంబీకులంతా చితకబాదారు. శబ్దాలు విని చుట్టుపక్కలవారు వచ్చారు. తమ కొడుకు పట్టుబడ్డాడన్న సంగతి తెలిసి.. అతని పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరుకుటుంబాల మధ్య వాగ్వాదం జరగడంతో.. స్థానికులు సముదాయించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jan 05 , 2024 | 07:21 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising