Negative Energy: ఈ లక్షణాలు కనిపిస్తే మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ నిండిపోయిందని అర్ధం..
ABN, Publish Date - Dec 03 , 2024 | 05:03 PM
ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇంట్లోని సభ్యులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా గుర్తించాలి? ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని ఎలా తరిమేయాలి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Negative Energy: ఏ వ్యక్తి అయినా ప్రశాంతంగా జీవించగలిగే ఏకైక ప్రదేశం ఇల్లు. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు, శాంతి ఉంటుంది. కానీ, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే ప్రశాంతత ఉండదు. ప్రతికూల శక్తులు నివసించే ఇంట్లో ఏ విషయాల్లోనూ విజయం సాధించలేరు. ఎప్పుడూ ఏదొక సమస్యలు వస్తుంటాయి. అయితే, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా గుర్తించాలి? ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని ఎలా తరిమేయాలి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇంట్లో వింతగా అనిపించడం..
ఇంట్లోని వ్యక్తి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై చికిత్స తర్వాత కూడా నయం కాకపోతే ఇది ప్రతికూల శక్తికి సంకేతం. ఇంట్లో ఎక్కువగా గొడవలు జరగడం, ఇంటికి రాగానే బాధగానో, కోపంగానో, ఏడుపుగానో అనిపిస్తుంది. ఇది మీ ఇంట్లో ప్రతికూల శక్తితో నిండి ఉందని అర్థం చేసుకోండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా చూస్తున్నట్లు లేదా ఎవరి నీడైనా కనిపించినట్లు అనిపిస్తుంది. ఏదో తెలియని కదలిక అనుభూతి కలగడం. ఈ లక్షణాలన్నీ మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయని సూచిస్తున్నాయి.
నెగటివ్ ఎనర్జీని ఇలా తరిమేయాలి..
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఉండే మురికి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు నీటిలో కాస్త ఉప్పును కలిపి తుడుచుకుంటే మంచిది. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఉదయాన్నే తులసి కోట దగ్గర శుభ్రం చేసి దీపం వెలిగిస్తే నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది. ప్రతిరోజూ సాయంత్రం ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర దీపం వెలిగించాలి. దీని వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. చీకటి పడినప్పుడు ఇంటి గుమ్మం దగ్గర లైట్లు ఆన్ లో పెట్టుకోవాలి. ప్రధాన ద్వారం చీకటిగా ఉంటే లక్ష్మీదేవి వెనక్కి వెళ్లిపోతుంది. ఇంట్లో నుంచి ప్రతికూల శక్తిని తరిమి కొట్టడానికి మామిడి ఆకులతో తయారు చేసిన తోరణం కడితే ఇంటికి శుభం కలుగుతుంది.
(Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ABN న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)
Updated Date - Dec 03 , 2024 | 05:08 PM