ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Silence: `నిశ్శబ్దం' వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? విషయం తెలిస్తే పూర్తిగా సైలెంట్ అయిపోతారు..

ABN, Publish Date - Dec 07 , 2024 | 04:07 PM

నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుస్తే మీరు పూర్తిగా సైలెంట్ అయిపోతారు. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Silence

నిశ్శబ్ద ఆరోగ్య ప్రయోజనాలు: పెద్ద శబ్దం, బిగ్గరగా అరవడం మన శరీరంతో పాటు మన మనస్సు, మెదడుపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతో మన ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. అయితే, నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. మౌనం మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని.. మౌనంగా ఉండడం వల్ల మనలో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటామని చెబుతున్నారు. ఇది మీకు హాయిగా నిద్రపోవడానికి, మీ రక్తపోటును సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుందని అంటున్నారు. మౌనం యొక్క ఆరోగ్య రహస్యాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..


సృజనాత్మకత పెరుగుతుంది..

మౌనంగా ఉండటం మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. మీ మౌనం మీ జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. రోజులో ఒక గంట మౌనం పాటిస్తే సృజనాత్మకత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

ప్రశాంతంగా నిద్రపోవచ్చు..

మౌనంగా ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా ప్రశాంతంగా ఉంటుంది. దీంతో నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. హాయిగా, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అంతేకాకుండా, నిశ్శబ్దం కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది.

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది..

ప్రతిరోజూ కొద్దిపాటి మౌనం మెదడుకు, మనసుకు ఎంతో మేలు చేస్తుంది. ఇది మిమ్మల్ని ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, మౌనంగా ఉండటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

కోపాన్ని అదుపులో ఉంచుతుంది..

మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి మౌనంగా ఉండటం మంచిది. ప్రతిరోజూ కొంచెం మౌనం వహించడం వల్ల కోపాన్ని తగ్గించుకోవచ్చు. మౌనం మంచి నిర్ణయాలకు దారి తీస్తుంది. మీరు సమస్యల నుండి మీ మార్గాన్ని కనుగొనవచ్చు.

గొడవలు తగ్గుతాయి..

రోజుకు కనీసం ఒక గంట మౌనం పాటించాలి. దీని ద్వారా మన శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకోవచ్చు.. అలాగే కోపం వల్ల కుటుంబంలో, ఆఫీసులో గొడవలు వస్తాయి.. మౌనంగా ఉండి అంతా సవ్యంగా సాగుతుందని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు.)

Updated Date - Dec 07 , 2024 | 04:15 PM