Viral Video: వామ్మో.. బైక్ మీద ఉన్నాడా? కుర్చీ మీద కూర్చున్నాడా?.. సర్దార్జీ డ్రైవింగ్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం!
ABN, Publish Date - Jan 29 , 2024 | 03:44 PM
ఈ ప్రపంచంలో ఎంతో మంది సాధారణ వ్యక్తులు అసాధారణ ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. తగినంత గుర్తింపు లేక సామాన్యులుగానే ఉండిపోతారు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మారుమూల ప్రాంతాల్లోని వారి ప్రతిభను కూడా వెలుగులోకి తెస్తోంది.
ఈ ప్రపంచంలో ఎంతో మంది సాధారణ వ్యక్తులు అసాధారణ ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. తగినంత గుర్తింపు లేక సామాన్యులుగానే ఉండిపోతారు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మారుమూల ప్రాంతాల్లోని వారి ప్రతిభ కూడా వెలుగులోకి వస్తోంది. అలాంటి ఎందరో వ్యక్తుల వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వచ్చాయి. తాజాగా ఓ సర్దార్జీ బైక్ నడుపుతున్న వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది (Bike Videos).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ సర్దార్జీ (Sardar ji) తన బుల్లెట్‌ను (Bullet) రోడ్డుపై నడుపుతున్న తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రోడ్డుపై వేగంగా కదులుతున్న బుల్లెట్‌పై సర్దార్జీ కూర్చున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పంజాబ్‌లోని (Punjab) పటియాలా-సమాన్ రోడ్డులో బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న ఓ సర్దార్జీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాడు. వేగంగా వెళ్తున్న బైక్‌పై పూర్తిగా ఓ పక్కకు కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నాడు. హ్యాండిల్ పూర్తిగా వదిలేశాడు. ఆ రోడ్డుపై కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఆ సర్దార్జీ డ్రైవింగ్ స్టైల్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
1000thingsinludhiana అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. రెండ్రోజుల క్రితం షేర్ అయిన ఈ వీడియోకు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 1.3 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``భారత్‌లో ప్రతిభావంతులకు టెస్లా అక్కర్లేదు``, ``ఇప్పుడు పంజాబ్ పోలీసులు ఈ వ్యక్తి కోసం వెతుకుతున్నారు``, ``డ్రైవింగ్ స్టైల్ అమోఘం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - Jan 29 , 2024 | 03:44 PM