Viral: మంచాన 85 ఏళ్ల వృద్ధుడు! పక్కనే నిలబడి 22 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ డ్యాన్స్!
ABN, Publish Date - Dec 08 , 2024 | 10:51 AM
సోషల్ మీడియా యావలో పడ్డ యువతరం కనీస సంస్కారం కూడా కోల్పోతోంది. సమయం సందర్భం మరిచి వైరల్ వీడియోల కోసం ప్రయత్నిస్తూ మానవత్వం మంటగలిపేస్తోంది. సమాజంలో పలుచనై పొతోంది. ఇందుకు తాజా ఉదాహరణగా వైరల్ అవుతున్న వీడియోలో యువతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా యావలో పడ్డ యువతరం కనీస సంస్కారం కూడా కోల్పోతోంది. సమయం సందర్భం మరిచి వైరల్ వీడియోల కోసం ప్రయత్నిస్తూ మానవత్వం మంటగలిపేస్తోంది. సమాజంలో పలుచనై పొతోంది. ఇందుకు తాజా ఉదాహరణగా వైరల్ అవుతున్న వీడియోలో యువతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిక్కరేగిన నెటిజన్లు యువతిని చడామడా తిట్టేస్తున్నారు (Viral).
Viral: జస్ట్ 2 ఏళ్ల వయసు.. ఇంత స్పీడేంటిరా! ఈ తరం రేంజే వేరు!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, 85 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి బెడ్‌పై పడుకుని ఉన్నాడు. అతడి గర్ల్ ఫ్రెండ్ వయసు 22 ఏళ్లు. ఆమె పేరు బ్రోన్విన్ అరోరా. పెద్దాయన మంచాన ఉంటే ఆమె బెడ్ పక్కనే నిలబడి ఓ ఎనర్జిటిక్ సాంగ్‌కు స్టెప్పులేస్తూ వీడియో రికార్డు చేసింది. ఇది చాలదన్నట్టు.. ఆయన విల్లులో నా పేరు ఉంది. ఇక ఆయన్ను బతికుంచుతున్న మెషీన్లు ఆఫ్ చేసేదా’’ అంటూ ఓ క్యాప్షన్ కూడా కనిపించింది.
Psychological Games: పురుషులు మహిళలపై ప్రయోగించే మైండ్ గేమ్స్ ఇవే!
ఈ షాకింగ్ దృశ్యాలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండటంతో లక్షల కొద్దీ వ్యూస్ వచ్చిపడుతున్నాయి. అయితే, నెటిజన్లు మాత్రం ఆమెను చడామడా తలంటేస్తున్నారు. జనాలపై టిక్‌టాక్ ఎలాంటి ప్రభావం చూపిస్తోందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుందని ఓ వ్యక్తి అన్నారు. టిక్‌టాక్ కారణంగా ఓ తరం నాశనమైందని మరో వ్యక్తి కామెంట్ చేశారు. ‘‘వీడియోపై కామెంట్స్ ఎవరైనా కక్ష కొద్దీ జత చేసి ఉండొచ్చు కానీ ఇలా మంచాన ఉన్న వ్యక్తి పక్కన నిలబడి డ్యాన్స్ చేయడం, ఆ వీడియోను నెట్టింట పంచుకోవడం అసలు ఏమాత్రం బాలేదు. ఆమె మానవత్వాన్ని మరిచిపోయింది’’ అని మరో వ్యక్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంచాన ఉన్న వృద్ధుడు తన లాయర్‌కు ఫోన్ చేసి అప్పటికప్పుడు తన విల్లు మార్చేస్తే బాగుంటుంది’’ అని కొందరు అభిప్రాయపడ్డారు. ‘‘పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో కాకుండా తోటి వారి మధ్య సోషల్ మీడియా ప్రభావంలో పెరిగితే ఇలాగే ఉంటుంది’’ అని కొందరు విచారం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. జనాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. మరి ఈ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!
Kitchen: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఈ మార్పులు తప్పనిసరి!
Viral: ఏం ఐడియా బ్రో.. గుళ్లల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు భలే చిట్కా!
Updated Date - Dec 08 , 2024 | 06:19 PM