ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Baraat: వినూత్నంగా బరాత్ వేడుకలు.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో

ABN, Publish Date - Jan 07 , 2024 | 01:25 PM

భారతీయ వివాహం అనగానే ఆచారాలు, విందులు, ఎంటర్‌టైన్ పక్కా ఉంటాయి. పెళ్లయ్యాక పెళ్లికూతురుని అత్తగారింటికి తోడ్కొని వచ్చేటప్పుడు బంధువులంతా కలిసి చేసే బరాత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తూ ధూంధాంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఢిల్లీ: భారతీయ వివాహం అనగానే ఆచారాలు, విందులు, ఎంటర్‌టైన్ పక్కా ఉంటాయి. పెళ్లయ్యాక పెళ్లికూతురుని అత్తగారింటికి తోడ్కొని వచ్చేటప్పుడు బంధువులంతా కలిసి చేసే బరాత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తూ ధూంధాంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే బరాత్ నాడు పెట్టే డీజేనే ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సమస్యగా మారింది. డీజేలతో అర్ధరాత్రి వరకు ఇబ్బందికి గురి చేస్తున్నారని పలువురిపై కేసులు నమోదు చేసిన ఘటనలూ ఉన్నాయి.

ఈ సమస్యకి పరిష్కారంగా ఓ బరాత్ లో బంధువులు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అంతగా ఏం ప్రత్యేకత ఉందనుకుంటున్నారా? ఎలాంటి డీజే మోత, సౌండ్ బాక్స్ లు లేకుండా బంధువులంతా డ్యాన్స్ చేశారు. vlogger @sheffoodie ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో సదరు వీడియోను షేర్ చేశారు. బరాత్ కి వచ్చిన బంధువులంతా హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్నారు.


అందులో డీజే సాంగ్స్ ప్లే చేస్తుండగా వారంతా కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఎవరికీ ఇబ్బందిపెట్టకుండా తమకు నచ్చిన పాటలు వింటూ డ్యాన్స్ చేశారు. దీనిని సైలెంట్ బరాత్ గా పేర్కొంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి 19 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాటు 8 లక్షలకు పైగా లైక్ లు పొందింది. ఇతరులను డిస్టర్బ్ చేయకుండా చేసే ఈ డ్యాన్స్ బాగుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మరొక వినియోగదారుడు తన కామెంట్లో ... "వారి డ్యాన్స్ చూడటానికి ఇబ్బందికరంగా ఉంది. వారిని చూసినవారు 'ఏ పాగల్ హై సబ్ నాచ్ రహే బినా గానే కే' [వారికి పిచ్చి ఉందా? మ్యూజిక్ లేకుండా నృత్యం చేస్తున్నారు]" అని అంటారన్నాడు. మరొకరు ఈ రకమైన బరాత్‌పై ఆసక్తి ఉండదని కామెంట్ చేశారు.

"ఈ లింక్ క్లిక్ చేసి వీడియో చూసేయండి"

Updated Date - Jan 07 , 2024 | 01:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising