Lizard: ఈ భాగంపై బల్లి పడితే లక్ష్మి కటాక్షం ఖాయం..!
ABN, Publish Date - Dec 08 , 2024 | 04:03 PM
బల్లి అకస్మాత్తుగా మీ శరీరంలోని ఏదైనా భాగంపై పడితే దాని పరిణామాల గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? ఈ భాగంపై బల్లి పడితే లక్ష్మి కటాక్షం ఖాయం అని శాస్త్రలు చెబుతున్నాయి.
Lizard: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పొట్ట, నాభి, ఛాతీ, గడ్డం మినహా శరీరంపై బల్లి పడితే స్త్రీ పురుషులిద్దరికీ శుభప్రదం. పురుషులకు కుడి వైపున, స్త్రీల ఎడమ వైపున బల్లి పడటం సాధారణంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే, పురుషులకు ఎడమ వైపున, స్త్రీల కుడి వైపున బల్లి పడటం వల్ల వచ్చే ఫలితం అశుభకరంగా పరిగణించబడుతుంది. శరీరం యొక్క కుడి వైపున బల్లి పడి ఎడమ వైపు నుండి క్రిందికి వస్తే, అది దోషంగా పరిగణించబడదు. కానీ , కొందరికి మాత్రం దోషాలు కూడా ఏర్పడుతాయి. వెంటనే కాళ్లూ, చేతులు, మొహం శుభ్రంగా కడుక్కుని.. ఇంట్లో ఉన్న దేవడికి నమస్కరిస్తే చాలు. అయితే, శరీరంలోని ఈ భాగంపై బల్లి పడితే లక్ష్మి కటాక్షం ఖాయం అని శాస్త్రలు చెబుతున్నాయి.
ఆస్తులు..
ముఖం ముందు భాగంలో పడితే శుభప్రదం. నుదిటిపై పడితే ఆస్తులు కలిసొచ్చే యోగం ఉంటుందట.
ధన ప్రాప్తి
బల్లి కుడి చేతిపై పడితే ధన ప్రాప్తి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
శక్తి..
తలపై బల్లి పడితే శక్తి వస్తుంది. మీరు పని చేసే స్థలంలో పదోన్నతి, గౌరవం పొందుతారు.
నగలు..
బల్లి కుడి చెవిపై పడితే నగలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
మృత్యువులాంటి బాధ..
వెంట్రుకల చివర బల్లి పడితే మృత్యువులాంటి బాధను ఇస్తుంది.
(Note: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు.)
Updated Date - Dec 08 , 2024 | 04:04 PM