ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Happy Mens Day: మా జీవితాలకు వారే సర్వస్వం.. మా శక్తి, బలం వారే..

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:21 PM

ఇబ్బందులను ఎదుర్కోవడమే తప్ప బాధను బయటకు చెప్పుకోవడం వారికి తెలియదు.. కష్టం ఏదైనా ముందు వారిని దాటుకుని రావలసిందే.. అలాంటి మగవాళ్లను మనసారా అభినందించే రోజు ఇది..

Mens day

తండ్రి, భర్త, సోదరుడు, కుమారుడు, ఉపాధ్యాయుడు.. ఇలా ప్రతి మహిళ జీవితంలో కీలక పాత్ర పోషించే పురుషుల సేవలు అన్ని సార్లు గుర్తింపునకు నోచుకోవు. కుటుంబంతోపాటు సమాజంలోనూ పురుషులది బలమైన స్థానం. తమ జీవితంలోని మహిళలకు ఎల్లవేళలా మద్దతునిస్తూ.. కోరుకున్న రంగంలో ఎదిగేలా ప్రోత్సహిస్తున్న మగవాళ్లు ఎందరో. అన్ని రంగాల్లోనూ వీరి కృషి అపారం. అందుకే వారి సేవలను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక రోజును మెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.


ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం గూగుల్ సెర్చ్‌లో టాప్ ట్రెండింగ్ టాపిక్‌లలో హ్యాపీ మెన్స్ డే ఒకటి. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం సెర్చ్ వాల్యూమ్ లో 80 శాతం స్పైక్ త ఇండియాలో 10 గంటల వ్యవధిలో 20 వేలకు పైగా ఈ టాపిక్ గురించే శోధించారు.


ఈ దినోత్సవాన్ని ఏటా నవంబర్ 19న జరుపుకుంటారు. అన్ని వేళలా అండగా నిలుస్తూ.. మద్దతు, శక్తి, ధైర్యాన్నిస్తున్న పురుషులకు మహిళలు మెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది క్యాలెండర్ లో ఒక తేదీ మాత్రమే కాదు జీవితంలోని సవాళ్లను ఎదుర్కొని ప్రతిదానిని చక్కదిద్దే తండ్రులు, సోదరులు, భర్తలు, స్నేహితులు.. ఇలా మన జీవితంలో మూలస్తంభాలుగా పనిచేసే పురుషులను అభినందించడానికి ఇదొక మంచి సమయం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కష్టించి పనిచేసే శరీరమే కాదు.. జాలి, దయ, అచంచలమైన ప్రేమను అందించే మనసూ వారి సొంతం. అవే వారిని మా జీవితాల్లో అన్నిటికన్నా ముఖ్యమైన స్థానాన్ని అధిరోహించేలా చేశాయంటూ మహిళలు వారి జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Viral Video: భుజంపై కర్ర, బండిలో బ్యాగు.. డెలివరీ బాయ్ కథ


Updated Date - Nov 19 , 2024 | 01:24 PM