ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SORRY: 'సారీ' అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా.. చాలా మందికి ఇది తెలియదు..

ABN, Publish Date - Nov 30 , 2024 | 07:09 PM

'సారీ' అనే పదాన్ని తప్పు చేసిన తర్వాత విచారం వ్యక్తం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే, ఈ పదానికి అర్థం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం..

sorry

'సారీ' అనే పదం ఒక మ్యాజిక్ వర్డ్ లాంటిది. ఏదైనా తప్పు చేస్తే ఇతరులను క్షమించమని అడగడం కోసం సారీ అనే పదాన్ని ఎక్కువగా వాడుతాం. సారీ అనే పదం చెప్పడం వల్ల కొన్ని సార్లు పెద్ద గొడవలు కూడా సాల్వ్ అవుతాయి. అయితే, ప్రతి దానికి సారీ చెప్పడం మంచి అలవాటు కాదు. చాలామంది ఇలా సారీ చెప్పడం మంచి హ్యాబిట్ అని అనుకుంటుంటారు. అయితే, ఇటీవల ఓ పరిశోధనలో 'సారీ' ఎక్కువగా చెప్పడం వల్ల వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బ తింటుందని తేలింది.

కాన్ఫిడెన్స్ తగ్గుతుంది..

ఒక మనిషి రోజుకి యావరేజ్​ గా 8 నుంచి 20 సార్లు సారీ చెప్తారంట. అయితే, ఇన్ని సార్లు పారీ చెప్పడం వల్ల కాన్ఫిడెన్స్ తగ్గుతుందనీ, ఎదుటి వ్యక్తికి మీపై చెడు అభిప్రాయం ఏర్పడుతుందని తేలింది. ఏదైనా పెద్ద పొరపాటు చేసినప్పుడు మన వల్ల ఎదుటి వారు బాధపడుతున్నప్పుడు సారీ చెప్పడం బాగుంటుంది. అలా కాకుండా ప్రతి చిన్నవిషయానికి సారీ చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదట.


మహిళలే..

'సారీ' అనే పదాన్ని ఎక్కువగా మహిళలే వాడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ఇలా ప్రతి చిన్న దానికి సారీ చెప్పడం వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం తగ్గి పోతుందని, మనసులో కొద్దిపాటి గిల్టీ ఫీలింగ్ తో ఉంటారని, తమని తాము తక్కువగా చేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. అందుకే 'సారీ చెప్పడం ఒక హ్యాబిట్​లా కాకుండా అవసరానికి తగ్గట్టుగా ఆలోచించి చెప్పడం మంచిదని పరిశోధకులు అంటున్నారు.

'సారీ' అనే పదం వినడానికీ, పలకడానికీ సులువుగా ఉంటుంది. ఈ పదాన్ని నామ్ కే వాస్త్ గా చెప్పడం కాకుండా గుండె లోతుల్లోంచి ఆ పదం చెప్పాలి. 'ఇందులో నా తప్పు ఉంది.. అందుకు బాధపడుతున్నాను, నా తప్పును సరిదిద్దుకుంటాను, ఇంకోసారి ఈ తప్పు చేయను' అనే నాలుగు విషయాలు సారీ అనే పదానికి అర్థం కలిగి ఉంటాయి. సారీ అని కేవలం మాటవరసకు చెబితే దాని వాల్యూ పోతుంది. 'సారీ' అనే పదం చెప్పిన తర్వాతా మళ్లీ ఆ తప్పు ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు.

Updated Date - Nov 30 , 2024 | 07:09 PM