China: అలా చేయాలని తల్లిదండ్రుల డిమాండ్.. 3 గంటలపాటు విమానం ఆలస్యం
ABN, Publish Date - Jan 24 , 2024 | 02:11 PM
విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా ఇలాంటి ఘటన చైనా(China)లో వెలుగులోకి వచ్చింది. చెంగ్డూ నుంచి బీజింగ్ వెళ్తున్న ఓ విమానంలో తల్లిదండ్రులు తమ కుమారుడితో కలిసి ప్రయాణిస్తున్నారు. వారిద్దరు ఫస్ట్ క్లాస్‌లో టికెట్లు బుక్ చేసుకోగా.. పిల్లాడికి వేరే చోట టికెట్ బుక్ చేశారు.
బీజింగ్: విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా ఇలాంటి ఘటన చైనా(China)లో వెలుగులోకి వచ్చింది. చెంగ్డూ నుంచి బీజింగ్ వెళ్తున్న ఓ విమానంలో తల్లిదండ్రులు తమ కుమారుడితో కలిసి ప్రయాణిస్తున్నారు. వారిద్దరు ఫస్ట్ క్లాస్‌లో టికెట్లు బుక్ చేసుకోగా.. పిల్లాడికి వేరే చోట టికెట్ బుక్ చేశారు. పేరెంట్స్‌ని వదిలి చిన్నారి దూరంగా కూర్చోలేక.. ఏడవటం మొదలుపెట్టాడు.
దీంతో పేరెంట్స్ పిల్లాడికి ఫస్ట్ క్లాస్‌లో తమతో పాటు సీట్ ఇవ్వాల్సిందిగా విమానాయాన సిబ్బందిని కోరారు. దీనికి వారు అంగీకరించలేదు. సీట్లు రీబుక్ చేయాల్సిందిగా సూచించారు. కుమారుడికి కూడా టికెట్ తీసుకోవాల్సిందిగా అధికారులు కోరారు. అయితే చైనా విమాన నిబంధనల ప్రకారం రెండు ఫస్ట్ క్లాస్ టికెట్లు తీసుకున్న వారు మూడోది పొందటానికి అర్హులు. అందుకనుగుణంగా కుమారుడికి ఫస్ట్ క్లాస్ టికెట్ ఇవ్వాలని పేరెంట్స్ అభ్యర్థించగా దానికి వారు ససేమిరా అన్నారు.
విమానం ఆలస్యం అవుతుండటంతో తోటి ప్రయాణికులు బాలుడి తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దాదాపు 3 గంటలపాటు ఫ్లైట్ ఆలస్యమైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఫ్లైట్ అటెండెంట్‌లు, సెక్యూరిటీ గార్డులు, ప్రయాణికులు తండ్రిని చుట్టుముట్టి వారిని తిట్టడం కనిపిస్తోంది. తనను తిట్టడం ఆపాలంటూ.. అలా చేసే హక్కు మీకు లేదంటూ వారిపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఒకరు వివాదాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించారు.
ఎట్టకేలకు 3 గంటల తరువాత తల్లిదండ్రులిద్దర్ని విమానం నుంచి దింపేశారు. ఆలస్యంతో ఫ్లైట్ క్యాన్సల్ అయింది. దీంతో ప్రయాణికులంతా రీబుక్ చేయాల్సి వచ్చింది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాన్ని రద్దు చేశామని సదరు ఎయిర్ లైన్స్ ప్రకటించింది. నిజాన్ని దాచిపెడుతూ వాతావరణం అనుకూలించలేదని ఎయిర్ లైన్స్ చెబుతోందంటూ ప్రయాణికులు ఆరోపించారు. ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
"మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
Updated Date - Jan 24 , 2024 | 02:11 PM