ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

China: ఇల్లు కొంటే భార్య ఉచితం.. చైనా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వెరైటీ ఆఫర్లు.. ఎందుకంటే..

ABN, Publish Date - Jan 24 , 2024 | 07:55 PM

తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవడానికి వ్యాపారులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వినియోగదారులను ఆకర్షించడానికి పలు ఆఫర్లను ప్రకటిస్తుంటారు. అయితే చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్లు విచిత్రమైన మార్కెటింగ్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు.

తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవడానికి వ్యాపారులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వినియోగదారులను ఆకర్షించడానికి పలు ఆఫర్లను ప్రకటిస్తుంటారు. అయితే చైనా (China)కు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్లు విచిత్రమైన మార్కెటింగ్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. చైనాలో గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ నేల చూపులు చూస్తోంది (Real Estate in China). రియల్ ఎస్టేట్ సంక్షోభం చైనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. డిమాండ్ లేకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు వింత వింత ఆఫర్లతో రంగంలోకి దిగారు (Viral News).

చైనాలోని టియంజాన్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రకటించిన ఆఫర్ గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. తమ వెంచర్‌లో ఇల్లు కొంటే భార్య (Wife) ఫ్రీ అని ప్రకటించి అందర్నీ నివ్వెరపరిచింది. ఈ ప్రకటనపై చాలా మంది సీరియస్ అయ్యారు. చైనా ప్రభుత్వ అథారిటీ కూడా సదరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ప్రకటన ఇచ్చినందుకు రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది. ఇదిలా ఉండగా జెజియంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ కంపెనీ.. ఇల్లు కొంటే ఏకంగా బంగారు కడ్డీలను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది (Property Developers Offers).

చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ``ఎవర్‌గ్రాండ్`` రెండేళ్ల క్రితం దివాళా తీయడంతో కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత అనేక మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలు కూడా కుప్పకూలాయి. ఈ ప్రభావంతో చైనాలో ఇళ్ల రేట్లు అథ:పాతాళానికి పడిపోయాయి. కొత్త ఇళ్లు కొనే వారే కరువయ్యారు. చైనాలోని ప్రముఖ నగరాల్లో కూడా ఇళ్లకు డిమాండ్ లేకుండాపోయింది. రియల్ ఎస్టేట్ తిరిగి పుంజుకోవడానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అంచనా వేసింది.

Updated Date - Jan 24 , 2024 | 07:55 PM

Advertising
Advertising