ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: అబ్బా.. ఏం టెక్నిక్ ఆంటీ.. ఇలా అయితే గ్యాస్ చాలా కాలం వచ్చేస్తుంది.. వీడియో చూడండి..

ABN, Publish Date - Mar 20 , 2024 | 04:55 PM

డబ్బు ఆదా చేసే విషయంలో కొందరు భారతీయ మహిళలు అద్భుతంగా ఆలోచిస్తారు. ముఖ్యంగా మధ్యతరగతి గృహిణులు చక్కని టెక్నిక్స్‌తో కరెంట్, గ్యాస్ ఆదా చేస్తారు.

డబ్బు ఆదా చేసే విషయంలో (Money saving) కొందరు భారతీయ మహిళలు అద్భుతంగా ఆలోచిస్తారు. ముఖ్యంగా మధ్యతరగతి గృహిణులు చక్కని టెక్నిక్స్‌తో (Tricks) కరెంట్, గ్యాస్ ఆదా చేస్తారు. అయితే కొద్ది మంది పొదుపు విషయంలో మరీ కఠినంగా వ్యవహరిస్తూ పిసినారులుగా పేరు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Jugaad video) చూస్తే షాకవ్వాల్సిందే. గ్యాస్ (Gas saving) ఆదా చేసేందుకు ఓ మహిళ వినియోగించిన టెక్నిక్ చాలా మందిని ఆలోచనలో పడేసింది.

rekha_sharma అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ వంట గదిలో ఉంది. కూరగాయలను ఉడికించేందుకు ముందుగా గ్యాస్ మీద కుక్కర్ పెట్టింది. కుక్కర్‌లో కూరగాయలు, నీళ్లు వేసింది. ఆ కుక్కర్‌ పైన ఓ పెనం పెట్టి నూనె వేసింది. కింద నీటి వేడికి ఆ పెనంలోని నూనె వేడక్కింది. ఆ నూనెలో ఆమె పూరీలు వేయించేసింది. ఈ జుగాడ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె ఉపయోగించిన టెక్నిక్ చూసి చాలా మంది షాకయ్యారు.

ఈ వైరల్ వీడియోకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 3.4 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ``మరీ అంత ఆదా అవసరమా``, ``భారతీయ మహిళలకే ఇలాంటి ఐడియాలు వస్తాయి``, ``కుక్కర్ ఒత్తిడి కారణంగా పెనం బౌన్స్ అయితే మీ పరిస్థితి ఏంటి``, ``ఈ టెక్నిక్ అద్భుతంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 20 , 2024 | 04:55 PM

Advertising
Advertising