Viral News: ఇదేం ప్రేమ రా అయ్యా..16 ఏళ్ల బాలుడిని టీచర్ కారులో తీసుకెళ్లి..
ABN, Publish Date - Dec 04 , 2024 | 01:22 PM
రోజు రోజుకు మన చుట్టూ అనేక ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతున్నాయి. తాజాగా, అలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ టీచర్ చేయకూడని పని చేసి, గురువు అనే పేరుకు మచ్చ తెచ్చింది.
Viral News: రోజు రోజుకు మన చుట్టూ అనేక ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతున్నాయి. తాజాగా, అలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. మీరు గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురుదేవో, మహేశ్వరః అనే శ్లోకం వినే ఉంటారు. ఈ ఒక్క శ్లోకంలో గురువు మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తాడో అర్థమవుతోంది. జీవితాన్ని మార్చే బ్రాహ్మణుడితో పోలిస్తే ఉపాధ్యాయులను దేవతలుగా పరిగణిస్తారు. కానీ, ఇక్కడ ఓ టీచర్ చేయకూడని పని చేసి, గురువు అనే పేరుకు మచ్చ తెచ్చింది.
టీచర్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత యువతి తన కుటుంబ సభ్యులకు తెలియకుండా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
16 ఏళ్ల బాలుడితో టీచర్ రిలేషన్
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన 25 ఏళ్ల యువతి, స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. సోషల్ మీడియా ద్వారా మీరట్ అనే 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ మొబైల్ ఫోన్లలో మాట్లాడుకోవడం ప్రారంభించారు. కొంత కాలం వీరి ప్రేమయణం సాఫీగా సాగింది.
నకిలీ పత్రాలు సృష్టించి..
ఒకరోజు మీరట్‌ను కారులో తీసుకెళ్లిన టీచర్.. అబ్బాయి మేజర్ అని నకిలీ పత్రాలు సృష్టించి పెద్దలకు తెలియకుండా దొంగతనంగా ఆ బాలుడిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో ఆ టీచర్ పై తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుగుతోంది.
(Note:పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ABN దీనిని ధృవీకరించ లేదు. )
Updated Date - Dec 04 , 2024 | 01:26 PM