డీఎస్ అస్తమయం
ABN, Publish Date - Jun 29 , 2024 | 04:13 PM
రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం, మాజీమంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(76)(డీఎస్) అనారోగ్యంతో కన్నుమూశారు. నరాల సంబంధిత వ్యాధితో కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ, ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రార్థించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, వేముల, మాజీ స్పీకర్ పోచారం, వీహెచ్, ఇతర నేతలు డీఎస్ పార్థివదేహానికి నివాళులర్పించారు.
Updated Date - Jun 29 , 2024 | 04:13 PM