అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట.. ప్రముఖుల రాక..
ABN, Publish Date - Jan 22 , 2024 | 12:31 PM
అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భారత దేశమంతా ఆధ్యాత్మిక శోభ, సందడి నెలకొంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలు కానుంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా తిలకించేందుకు పలువురు ప్రముఖులు అయోధ్యకు తరలి వచ్చారు. రామనామ స్మరణతో దేశం మార్మోగిపోతోంది. అలాగే ఇతర దేశాల్లోనూ రామ ప్రతిష్ఠ సంబురాలు జరుగుతున్నాయి.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరం.. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం..
అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు అయోధ్యకు వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు అయోధ్యకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు.
అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు అయోధ్యకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్..
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, అలియాభట్, కత్రినాకైప్, విక్కీకౌశల్ తదితరులు
Updated Date - Jan 22 , 2024 | 12:31 PM