Devinavaratri: కరెన్సీ నోట్లతో మెరిపోతున్న అమ్మవారు.. ఎక్కడంటే
ABN, Publish Date - Oct 08 , 2024 | 03:20 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ప్రతీరోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆరవరోజైన ఈరోజు మహాలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం 3 కోట్ల 33 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది.
అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి.
ప్రతీరోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఆరవరోజైన ఈరోజు మహాలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు.
ఈ అలంకరణ కోసం 3 కోట్ల 33 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది.
50, 100, 200, 500 నోట్లను అమ్మవారి అలంకరణకు వినియోగించారు.
అంతేకాదు ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అందంగా ముస్తాబు చేశారు. అచ్చం పులాకృతిలో ఉండేలా నోట్లను అక్కడ ఏర్పాటు చేశారు.
రంగు రంగు పూల మాదిరిగానే కరెన్సీ నోట్లు చూపరులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
కరెన్సీ నోట్ల అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
Updated Date - Oct 08 , 2024 | 03:20 PM