ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సాటిలేని సంపద

ABN, Publish Date - Apr 05 , 2024 | 09:05 AM

విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యాగురూణాం గురుః

విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం

విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యాగురూణాం గురుః

విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం

విద్యా రాజసుపూజ్యతే నహి ధనం విద్యావిహీనః పశుః... అంటూ విద్య విలువను, గొప్పతనాన్ని భర్తృహరి తన నీతి శతకంలో వివరించాడు.

దాన్ని ఏనుగు లక్ష్మణకవి...

విద్య నిగూఢగుప్త మగు విత్తము రూపము పూరుషాళికిన్‌

విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్‌

విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్‌

విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే... అని తెలుగువారికి అందించాడు.

భావం: మనుషులకు విద్యే అందం, అది ఎవరికీ కనిపించని సంపద. చదువు కీర్తిని, సుఖాన్ని, భోగాన్ని కలిగిస్తుంది. విద్య గురువులకు గురువు. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు అండగా నిలిచే బంధువులాంటిది. అది మనకు మరో కన్ను లాంటిది. విద్యాధనాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరేదీ లేదు. సభలలో, సదస్సులలో విద్యకు గౌరవం దక్కుతుంది తప్ప ధనానికి కాదు. అంతటి గొప్పదైన విద్యను పొందని మనిషి పశువుతో సమానం.

Updated Date - Apr 05 , 2024 | 09:05 AM

Advertising
Advertising